మళ్లీ వంట గ్యాస్ సిలిండర్ ధర పెంపు
ధర రూ.25 పెంపు..పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి
LP Gas Cylinder
న్యూఢిల్లీ: సామాన్యుడికి వంటగ్యాస్ సిలిండర్ ధరల పెరుగుదల షాక్ ఇస్తోంది. ఒకే నెలలో మూడు సార్లు వంటగ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. ఈ రోజు వంటగ్యాస్ సిలిండర్‌పై మరో రూ.25 పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి.
పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపాయి. ఈ నెల 4వ తేదీన సిలిండర్‌పై రూ.25 పెరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 15వ తేదీన మరో రూ.50 పెరిగింది. మూడుసార్లు గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడంలో ఈ నెలలో మొత్తం రూ.100 పెరిగినట్లయింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/