నేడు కుప్పంలో చంద్రబాబు పర్యటన

చిత్తూరు: టిడిపి అధినేత చంద్రబాబు మూడు రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన శాంతిపురం, రామకుప్పం మండలాల పార్టీ నేతలతో ఆయన సమావేశం అవుతారు. సోమవారం ఉదయం అమరావతికి తిరిగి వస్తారు. ఇక చంద్రబాబు పర్యటనతో టిడిపి, వైఎస్‌ఆర్‌సిపి నేతల మధ్య మాటల యుద్ధం నెలకొంది. చంద్రబాబు పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేస్తే తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తుందని కుప్పం టిడిపి నేతలు హెచ్చరించారు. ఇక కుప్పంలో గెలిచామని కాలర్ ఎగరేసిన వైఎస్‌ఆర్‌సిపి ఫ్యాన్స్ ఇప్పుడు చంద్రబాబును అడ్డుకుంటామని అంటున్నారని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు విమర్శించారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/