అంతర్జాల వలయంలో మానవుడు

జీవితంలో చాలా మార్పులు

Internet
Internet

సమాచారాన్ని చేరవేయడానికి ఒకప్పుడు పోస్టు కార్డు, ఇన్లాండ్‌లెటర్‌, టెలిగ్రామ్‌ తదితరాలు వాహకాలుగా ఉండేవి. సమాధానం కోసం రోజులతరబడి వేచి ఉండవలసి వచ్చేది. తర్వాత కాలంలో టెలిఫోన్‌ మొబైల్‌ ఫోన్‌ రావడంతో సుదూర ప్రాంతాలలో ఉన్నవారితో సైతం సంభాషిం చడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం సాధ్యమైంది.

మొబైల్‌ ఫోన్‌ ఆవిష్కరణ ఒక అద్భుతమైతే దానికి ఇంటర్నెట్‌ కనెక్టివిటీతో కావలసిన సమాచారాన్ని కొన్ని సెకనులలోనే బ్రౌజ్‌ చేసుకోవడం, సామాజిక మాధ్యమాలలో సమాచారాన్ని చేర వేయడం, ఆర్థిక లావాదేవీలు కూడా ఫోన్‌ ద్వారానే జరపటం ద్వారా మనిషి జీవితంలో చాలా మార్పువచ్చింది.

ఇప్పుడు కరోనా కాలంలో ఆన్‌లైన్‌ క్లాసుల పేరుతో పిల్లల చదువు లు కూడా అంతర్జాలంలోనే సాగుతున్నాయి. అరచేతిలో అంతర్జా లంతో ప్రపంచం కుగ్రామమైంది. అదే సమయంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మన జీవితంలో విషాదం చోటు చేసుకోక మానదు. అంతర్జాలం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంప్యూ టర్లను కలిపే వ్యవస్థ. అన్ని కంప్యూటర్లకు అందుబాటులో ఉండే కమ్యూనికేషన్‌ టెక్నాలజీ సాధనమే ఇంటర్నెట్‌.

వ్యక్తుల, సంస్థల నుండి ప్రభుత్వపరిపాలన దాకా అంతర్జాలంలోనే సాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వేలాది టివి ఛానళ్లు, వార్తా పత్రికలు, అలాగే విద్యార్థుల చదువ్ఞలు, ఫలితాలు, కౌన్సిలింగ్‌, మీసేవా లాంటి సేవలన్నింటిని అంతర్జాలంలో సంబంధం లేకుండా ఊహించలేం. అపరిమిత డేటా ఆఫర్లు వచ్చాక మొబైల్‌ ఇంటర్నెట్‌ వాడకం పెరిగింది. అదే సమయంలో గుర్తింపు, భద్రత లేని యాప్స్‌ ద్వారా మొబైల్‌ యూజర్ల డేటా లీక్‌ అవ్ఞతోంది. ‘మీరు వాడే ప్రోడక్ట్స్‌కు డబ్బులు చెల్లించకపోతే మీరే ప్రొడక్ట్‌ అవుతారు.

అంటే ఏదైనా ఉచితంగా ఉపయోగించాలని చూస్తే మనమే ప్రొడక్ట్స్‌గా మారాల్సి ఉంటుంది. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ లాంటి సోషల్‌ మీడియా యాప్‌ లను మనం దాదాపు ఉచితంగానే ఉపయోగిస్తున్నాం. మరి ఇవి నిజంగానే ఉచితంగా సేవలు అందిస్తున్నాయా? అనే ప్రశ్నకు కాదనే సమాధానం వస్తుంది. మన వ్యక్తిగత సమాచారాన్ని అమ్ముకుంటూ ఈ సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లు డబ్బులు సంపాదిస్తుంటాయి. భారత్‌లో వాట్సాప్‌కు సుమారు 40 కోట్ల మంది వినియోగదారులు ఉన్నట్లు జర్మనీ డేటా సంస్థ స్టాటిస్టా చెబుతోంది. ఈ దరిమిలా ఇటీవల వాట్సాప్‌ కొత్త ప్రైవసీ విధానం వివాదానికి తెరలేపింది.

భారత్‌తోపాటు ఐరోపాయేతర దేశాల్లో తమ ప్రైవసీ పాలసీలో వాట్సాప్‌ మార్పులు చేసింది. దీనితో వాట్సాప్‌ తమ ఖాతాదారుల సమాచారాన్ని ఫేస్‌బుక్‌తో పంచుకొని సొమ్ము చేసుకోవాలనే కుయుక్తికి తెర లేపిందని సైబర్‌నిపుణుల అభిప్రాయం. ఈ పాలసీ వినియోగదారులను సమస్యల సుడిగుండంలోకి లాగుతుందని సైబర్‌ చట్టాల నిపు ణుడు ‘వాట్సాప్‌ లా పుస్తక రచయిత వ్యాఖ్యానించారు. భారతీయుల వ్యక్తిగత గోప్యతా హక్కులతోపాటు భారతీయ చట్టాలను సైతం ఈ కొత్త పాలసీ ఉల్లంఘిస్తోందని ఆయన వివ రించారు.ప్రస్తుతం సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. పోలీసుల నకిలీ మీడియా ఖాతాలు సృష్టించి వసూళ్లకు పాల్పడుతున్నారు.

నకిలీ ఫోన్‌ నెంబర్లను ఉపయోగించి గిఫ్ట్స్‌ ఆఫర్ల పేరుతో మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు. వీరు ఎక్కువగా హర్యానా, ఢిల్లీ, కోల్‌కతాలో నకిలీ డాక్యుమెంట్లు పెట్టి సిమ్‌కార్డులు తీసుకొని ఓఎల్‌ఎక్స్‌లో సరసమైన ధరలకు వాహనాలు, ఫోన్లు, ఇతరత్రా వస్తువ్ఞలు ఇస్తామంటూ డబ్బులు పంపించాలని ఫోన్లు చేస్తుంటారు. తీరా ఆన్‌లైన్‌ ద్వారా డబ్బులు పంపించాక ఫోన్‌ ఆఫ్‌ చేస్తారు. రాజస్థాన్‌కు చెందిన ఓ ముఠా ఈ విధమైన మోసాల్లో ఏకంగా ఆర్మీ అధికారుల ఫొటోలు, పేర్లను ఉపయో గిస్తుంది. మొత్తం 18 రాష్ట్రాలలో ఈ ముఠా సభ్యులు మోసా లకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆరు నెలల్లోనే ఈ తరహా నేరాలు నాలుగురెట్లు పెరిగాయని పోలీసులు వెల్లడించారు.

‘మీకు కోట్ల విలువైన బహుమతి వచ్చింది. పదివేలు పంపితే మీఇంటికి చేరుతుంది. మేము మీ బ్యాంకు నుండి మాట్లాడుతున్నాం మీ ఆన్‌లైన్‌ ఖాతాలను సరిచేస్తున్నాం, ఓటిపి చెప్పండి. అని నిన్నమొన్నటి వరకు హర్యానా, రాజ స్థాన్‌, ఉత్తరప్రదేశ్‌కు చెందిన సైబర్‌నేరగాళ్లు దోపిడీలకు పాల్పడే వారు. ఇప్పుడు పంథా మార్చి అందమైన అమ్మాయిలతో హనీట్రాప్‌ చేయిస్తున్నారు. అంతర్జాలంలో అనవసర విషయాల పట్ల మన అమూల్యమైన సమయం వృధా అవుతుంది. కావున మంచి, అవసరమైన విషయాల కోసం మాత్రమే అంతర్జాలాన్ని ఉపయో గించాలి. మీ ఖాతా కోసం పాస్‌ వర్డ్‌ను సృష్టించేటప్పుడు పెద్ద అక్షరాలు, చిన్న అక్షరాలు, చిహ్నాలు, అంకెల మిశ్రమాన్ని ఉపయోగించాలని నిర్దారించుకోండి. గుర్తుంచుకోవడం కష్టమైనా అది మీ డేటాను రక్షిస్తుంది.

నెట్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌ బ్యాం కింగ్‌, మొబైల్స్‌, సోషల్‌ మీడియాలకు ఒకే పాస్‌ వర్డును వాడకుండా చూసుకోవాలి. మొబైల్‌ బ్యాంకింగ్‌ యాప్స్‌ వాడే ఫోన్‌లో గేమ్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోకపోవడం మంచిది. ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేసేటప్పుడు లేదా మీ ఆన్‌లైన్‌ బ్యాంకుఖాతాకు లాగిన్‌ అయినప్పుడు యుఆర్‌ఎల్‌కు బదులుగా హెచ్‌టిటిపితో ప్రారంభమవేతుందని గమనించండి.శాస్త్ర సాంకే తిక విజ్ఞ్ఞానాన్ని సరైనరీతిలో ఉపయోగించడం వల్ల గణనీయ మైన అభివృద్ధిచోటు చేసుకుంటుంది.కాని దానిని స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించినప్పుడే అనర్థాలకు దారి తీస్తుంది.

  • గుండు కరుణాకర్‌