లవ్ స్టోరీ టాక్ : బ్లాక్ బస్టర్ హిట్

నాగ చైతన్య – సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ లవ్ స్టోరీ. భారీ అంచనాల మధ్య ఈరోజు (సెప్టెంబర్ 24) వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున విడుదలైంది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించగా.. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరించారు. ఇక ఈ సినిమా ఫై అంతటా పాజిటివ్ బజ్ నడుస్తుంది. ముఖ్యముగా మ్యూజిక్ గురించి ప్రతి ఒక్కరు చెపుతున్నారు. పవన్ కు ఫస్ట్ మూవీ అయినప్పటికీ ఎన్నో చిత్రాలకు మ్యూజిక్ అందించిన అనుభవం కలవాడిగా మ్యూజిక్ చేసారని చెపుతున్నారు. మొదటిసారి నాగచైతన్య తెలంగాణ యాసలో మాట్లాడి ఆకట్టుకున్నారు.

అంతే కాదు ఈ సినిమాలో చైతన్య డాన్స్ లుకూడా ఇరగదీశారు. డాన్స్‌ల కోసం చైతన్య చాలా కష్టపడ్డాడు. ఏదో సాదించడం కోసం హైదరాబాద్ వచ్చిన హీరో హీరోయిన్ పడ్డ కష్టాలను చూపిస్తూనే… వారిద్దరి మధ్య చిగురించిన ప్రేమను… ఆ ప్రేమను పెళ్లిపీటలవరకు తీసుకెళ్లే క్రమంలో వారు ఎదురుకున్న కష్టాలను సినిమాలో చూపించారని అంటున్నారు. హృదయాన్ని తాకే సన్నివేశాలు, నటీనటులు ఫెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు ప్రధానంగా బలం అని చెపుతున్నారు. చివరి 30నిమిషాలు సినిమా ఓ రేంజ్ కి తీసుకెళ్లారని చెపుతున్నారు. ఓవరాల్ గా లవ్ స్టోరీ కి అంత పాజిటివ్ టాక్ నడుస్తుంది.