రేవంత్ రెడ్డి ఫై జగ్గారెడ్డి ఫైర్

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జగ్గారెడ్డి..పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. పార్టీలో చర్చించకుండా ముందే ప్రోగ్రాంలు ఫిక్స్‌ చేయడమేంటి..ఇది పార్టీనా లేదా ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీనా? అంటూ ఓ రేంజ్ లో మండిపడ్డారు.

శుక్రవారం మీడియా సమావేశంలో​ ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ లో అందరూ ఒకటే.. ఒక్కరే స్టార్‌ అనుకుంటే కుదరదని జగ్గారెడ్డి అన్నారు. పార్టీ సీనియర్లతో చర్చించకుండానే రెండు మాసాల కార్యాచరణను ఎలా ప్రకటిస్తారని జగ్గారెడ్డి ప్రశ్నించారు. జహీరాబాద్ లో క్రికెట్ మ్యాచ్ విషయంలో గీతారెడ్డికి సమాచారం ఇవ్వరా? అని ఆయన అడిగారు. సంగారెడ్డికి వస్తే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న నాకే సమాచారం ఇవ్వరా? అని ఆయన అడిగారు. కనీసం ప్రోటోకాల్ పాటించాలి కదా అని అడిగారు. జగ్గారెడ్డికి , రేవంత్‌ రెడ్డికి విభేదాలు ఉన్నట్లు రేవంత్‌ పరోక్షంగా చెబుతున్నారా.. అని విమర్షించారు. రేవంత్‌ రెడ్డి పీసీసీ చీఫ్‌ కాకముందు.. తాను మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యానని జగ్గారెడ్డి గుర్తు చేశారు. సీఎల్పీ కార్యాలయంలో కాంగ్రెస్‌ సభాపక్షం సమావేశంకానున్న నేపథ్యంలో జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.