షర్మిల ఫై ఎమ్మెల్సీ కవిత సెటైర్

వైస్ షర్మిల ఫై టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సెటైర్ వేసింది. తాము వదిలిన బాణం.. తానా అంటే తందానా అంటున్న తామర పువ్వులు అంటూ సెటైర్లు వేసింది. YSRTP అధినేత్రి షర్మిల అరెస్ట్ తో తెలంగాణ లో మరోసారి రాజకీయాలు వేడెక్కాయి. షర్మిల అరెస్ట్ ఫై బిజెపి , కాంగ్రెస్ పార్టీ లు తప్పుపడుతున్నాయి. అయితే టిఆర్ఎస్ నేతలు మాత్రం విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే మంత్రి వేముల ఘాటైన వ్యాఖ్యలే చేసిన సంగతి తెలిసిందే.

తెలంగాణ ఉద్యమానికి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వల్ల తీరని అన్యాయం జరిగిందని ప్రశాంత్ రెడ్డి అన్నారు. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా చేస్తే… తాను కాంగ్రెస్ పార్టీని వీడతానని ఏకంగా సోనియా గాంధీనే రాజశేఖరరెడ్డి బ్లాక్ మెయిల్ చేశారని ఆయన ఆరోపించారు. ఈ కారణంగా తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసేందుకు సోనియా ఒప్పుకున్నా… వైఎస్ బ్లాక్ మెయిల్ రాజకీయాలతో వెనక్కు తగ్గారని ఆరోపించగా..తాజాగా కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ ద్వారా షర్మిల ఫై సెటైర్లు వేసింది.

తాము వదిలిన బాణం.. తానా అంటే తందానా అంటున్న తామర పువ్వులు అంటూ వ్యంగ్యాస్త్రం సంధించారు. వైఎస్సాఆర్‌టీపీ, బీజేపీ పార్టీలు రెండు ఒకటేనని, షర్మిల వెనుక బీజేపీ ఉందని అర్థం వచ్చేలా ఆమె ట్వీట్ చేశారు. మంగళవారం ప్రగతిభవన్‌ ముట్టడి పేరుతో వైఎస్‌ షర్మిల నానా హంగామా చేసిన విషయం తెలిసిందే. షర్మిల హంగామా చేస్తుండటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. షర్మిలను కారులో దిగాలని పోలీసులు సూచిస్తున్నా ఆగకుండా పోలీసులపై దూసుకెళ్లారు. దీనిని రికార్డు చేస్తున్న మహిళా ఎస్సై చేతిలో నుంచి సెల్‌ఫోన్‌ను కూడా లాగేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడి, ప్రజలు ఇబ్బందులకు గురవుతుండటంతో, ట్రాఫిక్‌ క్రేన్‌ను రప్పించి, డ్రైవింగ్‌ సీట్‌లో ఆమె కూర్చొని ఉండగానే కారును టోయింగ్‌ చేస్తూ ఎస్సార్‌ నగర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అయితే షర్మిలను అరెస్టు చేయడాన్ని బీజేపీ నేతలతోపాటు కేంద్ర మంత్రి కిషణ్‌ రెడ్డి ఖండించిన విషయం తెలిసిందే.