కరోనాపై అభిమానులకు కోహ్లీ జాగ్రత్తలు

కరోన వచ్చిన తర్వాత ఇబ్బంది పడటం కంటే నివారణ చర్యలు తీసుకోవడమే మేలు

kohli
kohli

ముంబయి: దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన అభిమానులకు జాగ్రత్తలు చెప్పాడు. అందరూ అప్రమత్తంగా ఉండాలని, వైరస్ సోకకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలిపాడు. కరోనా వచ్చిన తర్వాత ఇబ్బంది పడటం కంటే… ముందుగానే నివారణ చర్యలు తీసుకుంటే మేలని అన్నాడు. బలంగా ఉండండి మరియు పోరాడండి కరోనాపై అందరం కలసికట్టుగా పోరాడుదామని చెప్పాడు. మరోవైపు, కరోనా ప్రభావంతో పలు టోర్నీలు రద్దవుతున్న సంగతి తెలిసిందే. ఇండియాదక్షిణాఫ్రికాల మధ్య జరగాల్సి వన్డే మ్యాచ్ లు కూడా రద్దయ్యాయి. ఐపీఎల్ వాయిదా పడింది. జపాన్ లో ఒలింపిక్స్ జరగడంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కోహ్లీ తన అభిమానులకు ట్విట్టర్ ద్వారా జాగ్రత్తలు చెప్పాడు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/