టీమిండియాకు షాక్‌ …గాయంతో ఇషాంత్‌ దూరం!!

ఇషాంత్‌ ఆరు వారాలు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ల సూచన

ishant sharma
ishant sharma

ముంబయి: న్యూజిలాండ్‌తో రెండో టెస్టుకు ముందు కోహ్లీసేనకు భారీ షాక్‌ తగిలింది. ఫామ్‌లో ఉన్న ఒకే ఒక్క పేసర్‌ ఇషాంత్‌ శర్మ గాయపడ్డాడని తెలిసింది. జనవరి తొలి వారంలో రంజీ మ్యాచ్‌ ఆడుతుండగా అతడి కాలి మడమ మలుచుకుంది. కనీసం ఆరు వారాల విశ్రాంతి అవసరం అవుతుందని డాక్టర్లు సూచించారు. అయితే మంచి ఫామ్‌లో ఉన్న ఇషాంత్‌ గాయంతో ఈ మ్యాచ్‌కు దూరమవ్వడం టీమ్‌ మేనేజ్‌మెంట్‌ను కలవర పెడుతోంది. స్వింగ్‌, పేస్‌ అనుకూలించే న్యూజిలాండ్‌ పిచ్‌లను ఇషాంత్‌ అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నాడు. తొలి టెస్టు తరహా పిచ్‌నే రెండో టెస్టుకు సిద్దం చేయగా..ఇషాంత్‌ సేవలు జట్టు కోల్పోవడం కోహ్లీసేనకు ప్రతికూలంగా మారింది. టెస్టుల్లో 300 వికెట్ల క్లబ్‌కు మూడు వికెట్ల దూరంలో ఉన్న ఇషాంత్‌ ..గాయం కారణంగా మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా తొలి టెస్టులో షమి, బుమ్రా, అశ్విన్‌ విఫలమైనా ఇషాంత్‌ మాత్రం అదరగొట్టాడు. 68 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. బ్యాట్స్‌మెన్‌ స్కోర్లు చేయకపోవడంతో టీమ్‌ఇండియా ఆ మ్యాచ్‌లో 10 వికెట్లు తేడాతో ఓటమి పాలైంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/