ఏపీలో బీర్ లోడ్ తో వెళ్తున్న లారీ బోల్తా..క్షణాల్లో బీర్లు మాయం

ఫ్రీ గా వచ్చిందంటే ఏది వదిలిపెట్టని ఈరోజుల్లో ఇక బీర్లు దొరికాయంటే వదిలిపెడతారా..? అందిన దగ్గరికి ఎత్తుకొని వెళ్లడమే. తాజాగా ఏపీలో ఇదే జరిగింది. బీర్ల లోడ్ తో వెళ్తున్న లారీ ..ప్రమాదానికి గురై..బీర్ బాక్స్ లన్ని రోడ్ ఫై పడ్డాయి. అంతే అది చూసిన జనాలు అందిన దగ్గరికి బీర్ బాక్స్ లు ఎత్తుకొని వెళ్లారు. అనకాపల్లిలోని కసింకోట రోడ్డులో బయ్యవరం జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది.

అనకాపల్లి డిపో నుంచి నర్సీపట్నం డిపోకు బీర్ల లోడ్ తో వెళ్తున్న లారీ..అనకాపల్లిలోని కసింకోట రోడ్డులో బయ్యవరం జాతీయ రహదారిపై బోల్తా పడింది. అంతే అది చూసిన జనాలు ఎన్ని దొరికితే..అన్ని బీర్ బాటిల్స్ ఎత్తుకొని వెళ్లారు. ఈ తరుణంలోనే.. 200 కేసుల బీర్ బాటిల్స్ నేలపాలు అయ్యాయి. ఇక ఈ సంఘటనపై తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని , అక్కడి జనాలను కంట్రోల్‌ చేసారు. దీనికి సంబదించిన వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.