దేశంలో కొత్తగా 11,692 కరోనా కేసులు

corona virus-india

న్యూఢిల్లీః దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 11,692 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,48,69,684కు చేరాయి. ఇందులో 4,42,72,256 మంది కోలుకున్నారు. 66,170 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 5,31,258 మంది బాధితులు మరణించారు. గత 24 గంటల్లో కొత్తగా 28 మంది వైరస్‌కు బలయ్యారు.

కాగా, మొత్తం కేసుల్లో 0.15 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 98.67 శాతం మంది కోలుకోగా, 1.18 శాతం మంది మరణించారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 220.66 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ఆరోగ్య శాఖ వెల్లడించింది.