బాసర ట్రిపుల్ ఐటీలో విషాదం.. విద్యార్థిని అనుమానాస్పద మృతి

బాసర ట్రిపుల్ ఐటీలో విషాద ఘటన చోటుచేసుకుంది. పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని లిఖిత హాస్టల్ నాలుగో అంతస్తు పైనుంచి కిందపడింది. అర్థరాత్రి 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. భద్రతా సిబ్బంది గమనించి.. అపస్మారక స్థితిలో ఉన్న విద్యార్థినిని క్యాంపస్ హెల్త్ సెంటర్లో ప్రథమ చికిత్స అందించి అనంతరం బైంసా ఏరియా హాస్పిటల్ కి తరలించారు.

అక్కడ నుండి మెరుగైన వైద్యం కోసం నిర్మల్ ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించగా, అక్కడి వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు ధృవీకరించారు. అయితే లిఖితది ఆత్మహత్య కాదని, యూ ట్యూబ్ చూస్తు క్రింద పడిపోయినట్లు వీసీ చెబుతున్నారు. రెండు రోజుల క్రితం గోపిక అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.