రేపటికి వాయిదా పడిన లోక్‌సభ

Lok Sabha postponed to tomorrow
Lok Sabha postponed to tomorrow

న్యూఢిల్లీ: లోక్‌ సభలో రెండవ విడత బడ్జెట్‌ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. కాగా రెండవ విడత బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే సమావేశాలు జరుగుతున్న సమయంలో విపక్షాల సభ్యులు తీవ్ర గందరగోళం సృష్టించారు. బడ్జెట్‌ అంశంపై చర్చను కొనసాగకుండా అడ్డుతగులుతున్నారు. పదేపదే వెల్‌లోకి దూసుకొచ్చారు. ప్లేకార్డులను పట్టుకొని, ఢిల్లీ అల్లర్లపై చర్చ జరగాలని పట్టుబట్టారు. బడ్జెట్‌ సమావేశాల అనంతరం, ఢిల్లీ అల్లర్లపై చర్చిద్దామని స్పీకర్‌ ఓం బిర్లా సర్దిచెప్పినా వినని విపక్ష సభ్యులు.. సభలో గందరగోళం సృష్టించారు. విపక్షాల ఆందోళనల మధ్యే ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ బ్యాంకింగ్‌ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం, స్పీకర్‌ సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/