విజయ్ దేవరకొండ ‘లైగర్’ క్లైమాక్స్ పిక్ లీక్ ..

విజయ్ దేవరకొండ – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కలయికలో తెరకెక్కుతున్న పాన్ మూవీ లైగర్. పూరీ కనెక్ట్స్ – ధర్మ క్రియేషన్స్ సంయిక్తంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచానాలే ఉన్నాయి. కరోనా కారణంగా షూటింగ్ కు బ్రేక్ పడగ..తాజాగా కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టి శరవేగంగా షూటింగ్ పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలో సినిమా తాలూకా ఓ పిక్ బయటకొచ్చింది. ఈ సినిమా ఫైటింగ్ సీన్ చేస్తున్న నేపథ్యంలో…. విజయ్ దేవరకొండ పిక్ లీక్ అయింది. షర్టు లేకుండా విజయ్ దేవరకొండ ఫైట్ చేస్తున్నట్లు ఈ ఫోటోలో కనిపిస్తోంది.

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో ఇక వైరల్ అవుతోంది. ఫోటో బట్టి చూస్తే ఇది ఖచ్చితంగా సినిమా క్లైమాక్స్ కు సంబంధించిందే అని తెలుస్తుంది. ఈ సినిమాలో విజయ్‌ కు జోడిగా అనన్య పాండే నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తున్నాడు.