పవన్ ‘వారాహి’ వాహనం ఏపీలో ఎలా తిరుగుతుందో చూస్తాం – వైస్సార్సీపీ నేతలు

పవన్ కళ్యాణ్ వారాహి వాహనంపై వైస్సార్సీపీ నేతల విమర్శలు ఆగడం లేదు. నిన్నటి వరకు వారాహి వాహన కలర్ ఫై పెద్ద రగడ చేసిన నేతలు..ఇప్పుడు వారాహి వాహనాన్ని తెలంగాణ రవాణా శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం , TS13EX 8384 నెం ఇచ్చినట్లు తెలుపడం తో షాక్ లో పడ్డారు. అయినప్పటికీ వారు విమర్శలు చేస్తూనే ఉన్నారు. అసలు తెలంగాణలో రిజిస్టేషన్ అయిన వాహనం ఏపీలో ఎలా తిరుగుతుందో చూస్తామని కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. మంత్రి అమర్నాథ్ సైతం.. ఏపీలో రూల్స్ తాము చెప్పామని, పవన్ హైదరాబాద్ లో ఉంటారు కాబట్టి అక్కడ రిజిస్ట్రేషన్ తీసుకున్నారేమో అని ఎద్దేవా చేశారు.

ఇక పవన్ వారాహి నంబర్ 8384 అని, ఈ నాలుగు నంబర్లు కలిపితే 23 అని, అది చంద్రబాబుకు నచ్చిన నంబర్ అని అమర్ నాథ్ కామెంట్ చేశారు. వారాహి వాహనం ఏపీకి వచ్చాక దానిపై తాము స్పందిస్తామన్నారు. అంటే వారాహి వాహనానికి ఏదొక విధంగా వైస్సార్సీపీ ప్రభుత్వం అడ్డుకుంటుందని చెప్పకనే చెప్పారు. మరి రాబోయే రోజుల్లో పవన్ బస్సు యాత్రకు ఎలాంటి అడ్డంకులు సృష్టిస్తారో అని అంత మాట్లాడుకుంటున్నారు.