పవన్ కళ్యాణ్ ఒక దసరా వేషగాడు అంటూ వైస్సార్సీపీ మహిళ నేత వ్యాఖ్యలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దసరా వేషగాడు అని , ఆయనకంటే బ్రహ్మ నందం బెటర్ అని వైస్సార్సీపీ మహిళ నేత , కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ జమల పూర్ణమ్మ అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్లీనరీలో ఆమె మాట్లాడుతూ.. టీడీపీ నేతలకు, పవన్ కళ్యాణ్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గతంలో చంద్రబాబును ఏం ప్రశ్నించావ్ …ఇప్పుడు ఏం ప్రశ్నిస్తావ్ అని.. మా నాయకుడిని ప్రశ్నించే దమ్ము నీకు లేదని పవన్ కళ్యాణ్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయావ్ …వార్డు మెంబర్ ను కూడా గెలిపించుకోలేకపోయావ్.. నీ వెంట వచ్చే వాళ్లకు ఓట్లు లేవయ్యా…గుర్తుంచుకో అని నిప్పులు చెరిగారు. ఈసారి ఐదు చోట్ల పోటీచేయి … ఓడిపోవడం ఖాయమని ఎద్దేవా చేసారు.

నీ కంటే బ్రహ్మానందం బెటర్ అని.. జనంలోకి వెళ్తే బ్రహ్మానందానికి కూడా జనం వస్తారని ఎద్దేవా చేశారు. పెళ్లిళ్ల పేరుతో ఎంత మంది ఆడవాళ్లను మోసం చేస్తావ్.. టీడీపీ, జనసేన నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే నాలుకలు తెగకోస్తామని.. ఆడవాళ్ల గురించి తప్పుగా మాట్లాడితే అయ్యన్న పాత్రుడు, లోకేష్‌ల తాటతీస్తామని హెచ్చరించారు.