హిమాయత్‌ సాగర్‌లో చిరుతపులి

పోలీసులకు సమాచారం అందించిన ప్రజలు

Leopard at Himayat Sagar
Leopard

ముఖ్యాంశాలు

  • మూడు రోజులుగా తప్పించుకు తిరుగుతున్న చిరుతపులి
  • మత్తు ఇచ్చేలోపే అది తప్పించుకుంది
  • వ్యవసాయ యూనివర్సిటీలోని దట్టమైన పొదల్లోకి వెళ్లిన చిరుతపులి,

Hyderabad: గత మూడు రోజులుగా తప్పించుకు తిరుగుతున్న చిరుతపులి ఆచూకీ లభించింది. రంగారెడ్డి జిల్లాలోని హిమాయత్‌ సాగర్‌లో చిరుతపులి నీళ్లు తాగుతుండగా చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో చిరుత కోసం హిమాయత్‌సాగర్‌ వద్ద పోలీసులు, అటవీశాఖ అధికారులు గాలిస్తున్నారు. మే 14న నగర శివారులోని కాటేదాన్‌ అండర్‌ బ్రిడ్జ్‌ వద్ద రోడ్డుపై తిరుగుతూ చిరుతపులి కనిపించింది.

అయితే అటవీశాఖ అధికారులు దానికి మత్తు ఇచ్చేలోపే అది తప్పించుకుంది. రోడు పక్కనే ఉన్న ఫాంహౌస్‌లోకి వెళ్లిన చిరుతపులి,

వ్యవసాయ యూనివర్సిటీలోని దట్టమైన పొదల్లోకి తప్పించుకుపోయింది. దీంతో అప్పటి నుంచి అధికారులు చిరుత ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/