అరికాళ్లకు బొబ్బలు ఏర్పడిన కానీ కేసీఆర్ కోసం మంత్రి సత్యవతి తగ్గట్లేదు

కేసీఆర్ మూడోసారి తెలంగాణ ముఖ్యమంత్రి అవ్వాలని కోరుతూ… మంత్రి సత్యవతి రాథోడ్ దీక్ష చేస్తున్నారు. ఆయన మరోసారి సీఎం అయ్యేంత వరకు తాను పాదరక్షలు ధరించనంటూ ఆమె మొక్కుకొని చెప్పులు లేకుండానే గత కొన్ని రోజులుగా నడుస్తుంది. ఆరోగ్య రీత్యా వైద్యులు చెప్పులు ధరించాలని సూచించినప్పటికీ ఏమాత్రం లెక్కచేయకుండా సీఎం కేసీఆర్ గారి కోసం మంత్రి సత్యవతిరాథోడ్ తన దీక్షను కొనసాగిస్తోంది.

46 డిగ్రీల మండుటెండలోసైతం పాదరక్షలు లేకుండా సత్యవతి రాథోడ్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గతేడాది సెప్టెంబర్ 17నుంచి పాదరక్షలు లేకుండా సత్యవతి రాథోడ్ తిరుగుతున్నారు. 9 నెలలుగా ఆమె చెప్పులు లేకుండానే తిరుగుతున్నారు. రెండురోజుల క్రితం మరణించిన ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ అంత్యక్రియల సందర్భంగా చెప్పులు లేకుండా మంత్రి మూడు కిలోమీటర్లు నడిచారు. ఎండలు ఎక్కువగా ఉండటంతో ఆమె కాళ్ళకి బొబ్బలు వచ్చాయి. దీంతో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు మంత్రి సత్యవతి రాథోడ్‌కి సూచించారు. బుధవారం రాత్రి అరికాళ్లకు బొబ్బలు ఏర్పడగా ఆయింట్‌మెంట్ రాయాల్సి వచ్చింది. అయితే, తన సంకల్పం నెరవేరే వరకూ చెప్పులు ధరించేది లేదని మంత్రి స్పష్టం చేశారు.