కొబ్బరి నూనెలో ఔషధ గుణాలు
తెగిన గాయాలకు చిట్కా వైద్యం

కొబ్బరి నూనె నుండి సాధారణంగా ఒక తియ్యటి వాసన వస్తుంది. ఈ నూనెను కేవలం మర్దన కోసమో, వంటకు మాత్రమే ఉపయోగిస్తారు.అనుకుంటే పొరపాటే.
అంతకుమించిన ఉపయోగాలేన్నో కొబ్బరినూనె వల్ల ఉన్నాయి. కొబ్బరినూనెలో ఎన్నో ఔషధ గుణాలుంటాయి.
కొబ్బరినూనె ఉపయోగించి ఇంటి వద్దే బట్టలు ఉతికే సబ్బు తయారుచేయవచ్చు. ఎందుకంటే ఇందులో ఎన్నో సమతుల్యతతో కూడిన గుణాలు ఉన్నాయి.
నురగ వచ్చేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. కొబ్బరినూనెలో యాంటీసెప్టిక్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. తెగిన గాయాలను త్వరగా మాన్పివేయడానికి ఈ నూనె సహాయపడుతుంది.
చాలామంది మందుల షాపుల్లో దొరికే వాటికే మొగ్గు చూపుతారు. దెబ్బతగిలిన ప్రాంతంలో ఈ నూనెను రాసి, ఆ తర్వాత బ్యాండేజ్ కట్టాలి.
చలిమంట బాగా పెరగాలనుకుంటే కొబ్బరినూనెలో దూదిని ముంచి మంటలో వేస్తే ఆ మంటలు విపరీతంగా పెరుగుతాయి.
ఇళ్లల్లో కత్తిరించే చెక్కపకలను భద్రపరిచేందుకు కొబ్బరినూనె ఎంతగానో ఉపయోగపడుతుంది.
పాత చెక్కపలకలకు ఈ నూనెతో పూత పూస్తే నీటికి, క్రిమికీటకాలను తట్టుకునే శక్తి పొందుతాయి.
కొబ్బరినూనె తలవెంట్రుకలకు ఎంతో మంచిది.
పొడిబారిన చర్మాన్ని యధాస్థితికి తేవడానికి ఉపయోగపడుతుంది.
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/