భద్రాచలం వద్ద శాంతించిన గోదావరి..

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం తగ్గుముఖం పట్టడం తో ముంపు గ్రామాల ప్రజలతో పాటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సోమవారం ఉదయం భద్రాచలం వద్ద 46.8 అడుగులు ఉండగా సాయంత్రానికి 42.6 అడుగులకు తగ్గింది. ప్రస్తుతం 40 అడుగుల వద్ద ఉంది.

తెలంగాణ లో ఇటీవల భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. దాదాపు వారం రోజుల పాటు ఆకాశానికి ఏమైనా చిల్లు పడిందా అనే రీతిలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురిసాయి. ఈ వర్షాలకు వాగులు , వంకలు , చెరువులు ఉప్పొంగి ప్రవహించాయి. దీంతో గోదావరికి వరద ఉదృతి పెరిగింది. ప్రస్తుతం భద్రాచలం వద్ద మూడు ప్రమాద హెచ్చరికలను ఉప సంహరించారు అధికారులు. ఇక ఏపీలో మాత్రం పలు గోదావరి ముంపు గ్రామాలు నీటిలోనే ఉన్నాయి.

కుక్కురూరు మండలంలో 1964 కుటుంబా లపై వరద ప్రభావం పడినట్టు రెవెన్యూ అధికారులు చెబు తున్నారు. పునరావాస కేంద్రాలకు 1100 మందిని తరలిం చారు. బాధితులకు 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ మంచినూనె, కూరగాయలు పంపిణీ చేసినట్టు తెలిపారు. కేఆర్‌పురం ఐటీడీఏ పీవో జీవీవీ సత్యనారాయణ, తహసీల్దార్‌ ప్రమద్వర పునరావాస కేంద్రాలను సందర్శిస్తున్నారు.

వరద నెమ్మదిగా తగ్గుతుండడంతో ముంపునకు గురైన పొలాలు బయట పడుతున్నాయి. వరి నారుమడులు, పత్తి మొక్కలు కుళ్లిపోవడంతో రైతులు నష్టపో యారు. భద్రాచలం రహదారిపై రాకపోకలు జరుగుతుండగా స్థానికంగా ఉన్న కొన్ని రహదారులు వరద నుంచి బయట పడినా ఒండ్రు మట్టి పేరుకుపోవడంతో రాకపోకలు నిలిచి పోయాయి.