ఇంట్లోనే ప్రార్ధనలు చేసుకోండి

మత పెద్ద గ్రాండ్‌ ముఫ్తీ షేక్‌ అబ్దుల్లాజీజ్‌ అల్‌ షేక్‌ వెల్లడి

makka madina
makka madina

రియాద్‌: వచ్చే వారం నుంచి రంజాన్‌ ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు తమ ఇంట్లోనే ఉండి ప్రార్ధనలు నిర్వహించుకోవాలని సౌదీ అరేబియా మతపెద్ద గ్రాండ్‌ ముఫ్తీ షేక్‌ అబ్దుల్లాజీజ్‌ అల్‌ షేక్‌ సూచించారు. రంజాన్‌ పర్వదినంలో మదీనాలోని ప్రముఖ మసీదులో ప్రతిరోజు ఏర్పాటు చేసే ఇఫ్తార్‌ను సైతం రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రపంచం మొత్తం కరోనా వైరస్‌ విజృంభిస్తున్న కారణంగా మార్చి రెండో వారం నుంచే సౌదీ అరేబియా ప్రార్ధనల విషయంలో మార్గదర్శకాలు జారీ చేసింది. మసీదుకు వెళ్లాల్సిన అవసరం లేదని , ప్రతి ఒక్కరు ఇంటిలోనే ప్రార్ధనలు చేసుకోవాలని సూచించింది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/