వైద్యులపై దాడి చేస్తే కఠిన చర్యలు

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌

eetela rajender
eetela rajender

హైదరాబాద్‌: వైద్యులపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. నారాయణగూడ లో టీఎన్‌జీవో ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. సమారు 200 మంది ఉద్యోగులు రక్తదానం చేశారు. ఈ సంద్బంగా మంత్రి మాట్లాడుతు కరోనా నుంచి కోలుకున్న బ్రిటన్‌ ప్రధాని నాకు ఏ దేవుడు లేడు.. వైద్యుడే దేవుడు అన్నారు. అలాంటి వైద్యులపై కొందరు దాడులకు దిగుతున్నారు. అవి ముర్ఖపు చర్యలు. వైద్యులు వారి ప్రాణాలను పణంగా పెట్టి మనకు సేవ చేస్తున్నారు. అలాంటి వారిపై దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. రాష్ట్రంలో రక్త నిల్వలు తగ్గిన నేపథ్యంలో రక్త దానం చేయడానికి ప్రజలు ముందుకు రావాలని సూచించారు, ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా 200 మంది రక్తదానం చేయడం హర్షణీయం అని మంత్రి అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/