అమెరికా నిర్ణయాన్ని తప్పుపడుతున్న ప్రపంచదేశాలు

మరోసారి పునఃసమీక్షించుకోవాలని సూచనలు

donald tump
donald tump

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధులు ఆపివేస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల అనేక దేశాల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఇప్పటికేఅనే దేశాలు ఈ నిర్ణయంపూ మరోసారి సమీక్షించుకోవాలని ట్రంప్‌కు సూచించారు. ఈ నిర్ణయంపై ఐక్యరాజ్యసమితి సహా, బిల్‌గేట్స్‌ వంటి ప్రముఖ వ్యాపార వేత్తలు కూడా వ్యతిరేఖత వ్యక్తం చేశారు. ట్రంప్‌ చర్యతో కరోనాపై పోరాటంలో డబ్ల్యూహెచ్‌వోకి నిధులు తగ్గుతాయని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటేరస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా ఈ నిర్ణయం పై మరోసారి పునఃసమీక్షించుకోడవాలని రష్యా కూడా సూచించింది. అలాగే తమ వంతు నిధులు సమకూర్చుతామని పేర్కోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా మహామ్మారిని కట్టడి చేయాలంటే నిధులు అవసరమని, ఈ సమయంలో ట్రంప్‌ ఈ నిర్ణయం తీసుకోవడం సరికాదని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రొస్‌ అధానోమ్‌ అన్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/