మత్స్య ఎడిషన్‌ ప్రాజెక్టును ప్రారంభించిన ప్రధాని

YouTube video
PM Shri Narendra Modi launches Pradhan Mantri Matsya Sampada Yojana

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి నేడు రెండు కొత్త పథకాలను ప్రారంభించారు. మత్య్సకారుల కోసం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, పాల రైతుల కోసం ఈగోపాల యాప్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ‘మత్స్యకారులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. వచ్చే మూడు నుంచి నాలుగేళ్లలో దేశంలో చేపల ఉత్పత్తిని రెట్టింపు చేయాలనేది మా లక్ష్యం. ఫిషరీస్ శాఖకు బూస్ట్ ఇవ్వడానికి దోహదపడుతుంది.’ అని అన్నారు. ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన అనేది శ్వేతవిప్లవం లాగా తీపి విప్లవానికి పునాది వేస్తుందన్నారు. అలాగే, దేశంలోని 21 రాష్ట్రాల్లో ఈ గోపాల యాప్ ద్వారా పాల ఉత్పత్తిదారులకు లబ్ది చేకూరుతుందన్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/