టిడిపి, వైఎస్‌ఆర్‌సిపిలపై మండిపడ్డా కన్నా

దోషులను పక్కన పెట్టి ఉద్యోగులను సస్పెండ్ చేస్తున్నారు

kanna laxmi narayana
kanna laxmi narayana

అమరావతి: టిడిపి ప్రభుత్వం హయాంలో దేవాలయాలను కూల్చేశారని, వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ మతంపై విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నాయని బిజెపి నేత కన్నా లక్ష్మీనారాయణ టిడిపి, వైఎస్‌ఆర్‌సిపిల మండిపడ్డారు. అంతర్వేది ఘటన మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన పని అని చెప్పడం దారుణమని… మతిస్థిమితం లేని వ్యక్తి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన ఘటన ఎక్కడా లేదని అన్నారు. అసలైన దోషులను పట్టుకోకుండా ఉద్యోగులను సస్పెండ్ చేస్తున్నారని కన్నా మండిపడ్డారు. అసలు దోషులను పక్కన పెట్టేందుకే ఇలాంటి పనులు చేస్తున్నారని అన్నారు. నిరసన వ్యక్తం చేస్తున్న బీజేపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వం హయాంలో కూలగొట్టిన దేవాలయాలను ప్రస్తుత ప్రభుత్వం నిర్మించాలని డిమాండ్ చేశారు.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/