కరణ్, అలియాభట్ పై నెటిజన్ల నిప్పులు

సుశాంత్ కు ఇలాంటి పరిస్థితి వచ్చేలా చేశారంటూ కొందరు బాలీవుడ్ వర్గాలపై తీవ్ర విమర్శలు

karan johar-Alia bhatt
karan johar-Alia bhatt

సుశాంత్ మరణంపై సోషల్ మీడియాలో నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు. చాలా సంవత్సరాల తర్వాత ఒకే విషయం గురించి ట్విట్టర్ లో ఇంతగా ఇండియన్స్ చర్చించడం ఇదే ప్రథమం.

చాలా మంది సుశాంత్ మృతికి సంతాపం తెలియజేస్తూ రెస్ట్ ఇన్ పీస్ అంటూ ట్వీట్ చేస్తూ ఉన్నారు.

మరికొందరు మాత్రం సుశాంత్ కు ఇలాంటి పరిస్థితి వచ్చేలా చేసిన కొందరు బాలీవుడ్ వర్గాల వారిపై తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు.

ముఖ్యంగా ఈ సమయంలో బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ మరియు ఆలియా భట్ లపై నెటిజన్స్ ఎక్కువగా విమర్శలు చేస్తున్నారు.

బంధుప్రీతి మరియు ఫెవరేటిజంతో కరణ్ జోహార్ వారసులకు మాత్రమే సినిమా ఛాన్స్ లు ఇవ్వడం.. ఇతరులను ఎదగకుండా అడ్డు పడటం వంటివి చేస్తాడంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

కంగనా రనౌత్ ఈ విషయమై కొన్నాళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కరణ్ జోహార్ పై ఆ సమయంలో కంగనా చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు చాలా మంది సమర్ధిస్తూ పోస్టులు పెడుతున్నారు.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/