తెలంగాణలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి

మొత్తం కేసుల సంఖ్య 5,193

corona virus -telangana

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతుంది. నిన్న 200కుపైగా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య, మంత్రిత్వశాఖ బులెటిన్ విడుదల చేసింది. కాగా రాష్ట్రవ్యాప్తంగా కరోనా బారినపడిన వారి సంఖ్య 5,193కు పెరిగింది. కొత్తగా నమోదైన 219 కేసుల్లో 189 జీహెచ్ఎంసీ పరిధిలో నమోదు కాగా, మిగిలినవి మిగతా జిల్లాల్లో నమోదయ్యాయి.

రంగారెడ్డి జిల్లాలో 13, మేడ్చల్, సంగారెడ్డిలో చెరో రెండు, వరంగల్ అర్బన్‌లో 4, వరంగల్ రూరల్‌లో 3, మహబూబ్‌నగర్, మెదక్, ఆదిలాబాద్, యాదాద్రి, వనపర్తి, పెద్దపల్లి జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. అలాగే, ఇప్పటి వరకు 2,766 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా, 187 మంది కరోనాతో కన్నుమూశారు. రాష్ట్రంలో ఇంకా 2,240 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/