నెగిటివ్‌ వచ్చినా శరీరంలోనే కరోనా

మరో 8 రోజులపాటు జీవించి ఉంటుంది.. వెల్లడించిన భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త.

corona virus
corona virus

బీజింగ్‌: కరోనా మహమ్మారి ప్రపంచానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. తాజాగా ఈ వైరస్‌పై చేసిన పరిశోదనలలో విస్తుపోయో విషయాలు బయటికొచ్చాయి. ఈ వైరస్‌ బారిన పడి కోలుకున్న వారికి మొదట రక్త నమూనాలో నెగిటివ్‌ వచ్చినప్పటికి, ఈవైరస్‌ వారి శరీరం నుండి పూర్తిగా తొలగిపోవట్లేదని, చైనాలో కరోనా రోగులపై పరిశోదనలు చేసిన భారత సంతతికి చెందిన లోకేశ్‌ శర్మ తెలిపారు. గత జనవరి 28 నుండి ఫిబ్రవరి 9 మధ్య వ్యాధికి చికిత్స పొందిన 16 మందిపై పరిశోదనలు చేశామని, వీరిలో రోజువిడిచి రోజు రక్త నమూనాలను సేకరించిమని అన్నారు. చికిత్స తరువాత వైరస్‌ లేదని నిర్ధారణ అయిన వారిలొ సుమారు సగం మందిలో ఈ వైరస్‌ మరో 8 రోజుల పాటు వారి శరీరంలో దాగుందని తెలిపారు. ఈ వైరస్‌ బారినుండి కోలుకున్న వారు మరికొన్ని రోజులు క్వారంటైన్‌ లో ఉంటే మంచిదని డాక్టర్‌లు సూచిస్తున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/