ఏడు లక్షలు దాటిన కరోనా కేసులు

వెల్లడించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

corona virus
corona virus

జెనీవా: ప్రపంచంలో కరోనా వైరస్‌ విలయతాండవం సృష్టిస్తుంది. రోజురోజుకు ఈ వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య అధికమవుతుంది. ఇప్పటి వరకు ఈవైరస్‌ బారిన పడిన వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 7 లక్షలు దాటిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. దీని బారిన పడి ఇప్పటివరకు ముప్పైవేల మందికి పైగా మరణించారు. సుమారు లక్షా 50 వేల మంది ఈ వైరస్‌ బారి నుండి కోలుకున్నారు. కేవలం గడిచిన 24 గంటలలో 63,159మ కొత్త కేసులు నమోదు అయ్యాయి. మరో 3,646 మంది ప్రాణాలు విడిచారు. అని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/