కరోనా బారిన యడియూరప్ప

గంటల వ్యవధిలోఆయన కుమార్తె కూడా కరోనా

Karnataka Chief Minister B.S. Yediyurappa
Karnataka Chief Minister B.S. Yediyurappa

Bangalore: కర్నాటక ముఖ్యమంత్రి  బీఎస్ యడియూరప్పకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించారు.

అలా  ప్రకటించిన గంటల వ్యవధిలోఆయన కుమార్తె కూడా కరోనా బారినపడ్డారు.

ఆ వెంటనే ఆమె బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చేరారు. సీఎం కూడా అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.  

సీఎం ఆరోగ్యంగా ఉన్నారని, నిపుణుల బృందం ఆయనను దగ్గరుండి పర్యవేక్షిస్తోందని మణిపాల్ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

యడియూరప్పకు కరోనా సోకిన విషయం తెలిసిన వెంటనే ఆయన కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు నిర్వహించగా కుమార్తెకు వైరస్ సంక్రమించినట్టు నిర్ధారణ అయింది.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/