సెల్ఫ్ క్వారంటైన్ లోకి కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో

రిజల్ట్ వచ్చేంత వరకు సెల్ఫ్ ఐసోలేషన్‌లోనే ఉంటానని వెల్లడి

Union Minister Babul Supriyo
Union Minister Babul Supriyo

New Delhi: కరోనా బారినపడిన కేంద్రమంత్రి అమిత్‌షాను కలిసిన మరో మంత్రి బాబుల్ సుప్రియో స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.

ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. తాను అమిత్ షాను కలిశానని, వైద్యుల సలహా మేరకు కుటుంబ సభ్యులకు దూరంగా గృహ నిర్బంధంలో ఉండనున్నట్టు తెలిపారు.

పరీక్షలు చేయించుకుని రిజల్ట్ వచ్చేంత వరకు సెల్ఫ్ ఐసోలేషన్‌లోనే ఉంటానని పేర్కొన్నారు.

కొవిడ్ నిబంధనల ప్రకారం అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/