గొప్ప నాయకుడు, విశ్వాస మిత్రుడికి శుభాకాంక్షలు

ప్రధాని మోడికి డోనాల్డ్ ట్రంప్‌ బ‌ర్త్‌డే విషెస్

Donald Trump wishes ‘great leader, loyal friend’ Narendra Modi

న్యూఢిల్లీ: గురువారం రోజు ప్రధాని నరేంద్రమోడి తన 70వ పుట్టిన రోజు జరుపుకన్నారు. ఈ నేప‌థ్యంలో అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌ మోడికి బ‌ర్త్‌డే విషెస్ తెలిపారు. గొప్ప నాయ‌కుడు, విశ్వాస మిత్రుడికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు అంటూ డోనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. ఫిబ్ర‌వ‌రిలో ఇండియా టూర్‌కు వ‌చ్చిన‌ప్పుడు అహ్మ‌దాబాద్‌లోని మోతేరా స్టేడియంలో జ‌రిగిన కార్య‌క్ర‌మానికి సంబంధించిన ఫోటోను కూడా త‌న విషెస్ ట్వీట్‌లో ట్రంప్ పోస్టు చేయ‌డం గ‌మ‌నార్హం. బ‌ర్త్‌డే విషెస్ చెప్పిన ట్రంప్‌కు మోడి థ్యాంక్స్ చెప్పారు. రెండు దేశాల మ‌ధ్య స్నేహ‌బంధం బ‌ల‌మైంద‌ని, యావ‌త్ మాన‌వాళికి ఇది మంచిద‌న్నారు. మోడికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపిన వారిలో ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ఉన్నారు. ప్ర‌పంచ దేశాధినేత‌లు ప్ర‌ధానికి శుభాకాంక్ష‌లు తెలిపారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/