క్రికెటర్ గా కష్టమే ..అధ్యక్ష పదవే ఈజీ

ఒత్తిడిలో ఆడటం ఎంతో కష్టం. అధ్యక్షుడిగా పొరపాటు చేస్తే దిద్దుకునే వీలుంటుంది

Sourav-Ganguly
Sourav-Ganguly

ముంబయి: క్రికెటర్ గా బాధ్యతల నిర్వహణ కష్టమేనంటూ గంగూలీ వ్యాఖ్యానించారు. ఆ బాధ్యత కంటే.. బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యత నిర్వహించడమే తేలికని చెప్పాడు. స్పోర్ట్స్ ఏసెస్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న గంగూలీ 2019 గాను ఉత్తమ టెస్టు జట్టుగా భారత్ ఎంపికవడంతో అవార్డును భారత జట్టు తరపున అందుకున్నాడు. ఈ సందర్భంగా గంగూలీ మాట్లాడుతూ.. భారత జట్టుకు ఉత్తమ జట్టు అవార్డు ఇచ్చినందుకు హర్షం వ్యక్తం చేశారు. జట్టు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ కు అభినందనలు తెలిపాడు. అస్ట్రేలియాతో మ్యాచ్ ఉండటంతో వారు ఇక్కడ లేరంటూ.. కొత్త ఏడాది సందర్భంగా టీమిండియాకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఈ ఏడాదిలో మెగా టోర్నీలున్నాయని, అండర్ 19 ప్రపంచకప్, పురుషుల, మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో భారత జట్లు రాణించాలని ఆశిస్తున్నానన్నాడు.

క్రికెటర్, అధ్యక్ష పదవీ బాధ్యతల నిర్వహణపై గంగూలీ వ్యాఖ్యానిస్తూ… ఒత్తిడిలో ఆడటం ఎంతో కష్టం. ఎందుకంటే ఆ సమయంలో బ్యాటింగ్ చేయడానికి ఒక్క అవకాశమే ఉంటుంది. కానీ అధ్యక్షుడిగా ఏదైనా పొరపాటు చేస్తే తర్వాత దాన్ని సరిచేసుకునే అవకాశముంటుందన్నారు. మెక్ గ్రాత్ బౌలింగ్ లో ఆఫ్ స్టంప్ మీద వేసిన బంతులను ఎదుర్కొన్నట్లుగా ఉంటుందని సౌరవ్ వ్యాఖ్యానించారు. ఇదిలా వుండగా, గతంలో భారత క్రికెట్ దిగ్గజం మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా అధ్యక్ష బాధ్యతలు సులువని వ్యాఖ్యానించాడు. సుప్రీంకోర్టు బీసీసీఐ,ఐపీఎల్ అధ్యక్షుడిగా నియమించినప్పుడు సమర్థంగా పనిచేశా, అది ఎంతో సులువు అని ఆయన అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/