మంత్రి సత్యేంద్ర జైన్‌ ఇంట్లో ఈడీ సోదాలు

న్యూఢిల్లీ : ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సోదాలు నిర్వహిస్తున్నది. ఈరోజు తెల్లవారుజాము నుంచి ఢిల్లీలోని ఆయన ఇంటిపై అధికారులు దాడులు నిర్వహించారు. గతనెల 30న మనీలాండరింగ్‌ కేసులో సత్యేంద్రను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మరిన్ని ఆధారాల కోసం ఆయన ఇంటిపై అధికారులు దాడులు నిర్వహించారు.

కాగా, కోల్ కత్తాకు చెందిన ఓ కంపెనీకి సత్యేంద్ర జైన్ అక్రమంగా డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసినట్లు ఈడీ నిర్ధారించింది. ఈ కేసులో సత్యేంద్ర జైన్, ఆయన బంధువులకు సంబంధాలున్నాయని భావిస్తున్న కంపెనీలకు చెందిన 4.81కోట్ల విలువైన స్థిరాస్థులను ఈడీ గత ఏప్రిల్‌లోనే జప్తు చేసింది. సత్యేంద్రజైన్ పై 2017లో నమోదైన కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తున్నది. జూన్‌ 9 వరకు సత్యేంద్ర ఈడీ కస్టడీలో ఉండనున్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/