సింధుకు ఢిల్లీ విమానాశ్రయంలో ఘనస్వాగతం
ఆగస్టు 15 వేడుకలకు హాజరు కానున్న ఒలింపిక్ బృందం
New Delhi: టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం విజేత తెలుగమ్మాయి పీవీ సింధు కి ఢిల్లీ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. విజయవాడ ఎంపీ కేశినేని నాని, విమానాశ్రయ అధికారులు, క్రీడా శాఖ, బ్యాడ్మింటన్ అకాడమీ అధికారులు పీవీ సింధుకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. ఒలింపిక్స్లో వ్యక్తిగత పోటీలలో రెండు పతకాలను సాధించిన తొలి భారత మహిళ పీవీ సింధు రికార్డు సృష్టింసిన విషయం తెలిసిందే బ్యాడ్మింటన్ క్రీడలో భారత్ నుంచి ఈ ఘనత ఎవరూ సాధించలేదు. సింధుకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. . సింధు భారతదేశానికే గర్వకారణమైన క్రీడాకారిణి అని పేర్కొన్నారు. ఇదిలావుండగా , ఒలింపిక్స్లో పాల్గొన్న భారత ఒలింపిక్ బృందం ఆగస్టు 15 వేడుకలకు హాజరుకానుంది. అంతేకాకుండా , వీరితో ప్రధాని మోదీ తన నివాసంలో భేటీ కానున్నారు.
తాతాజా బిజినెస్ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/