పఠాన్ ను వదలని బజరంగ్ దళ్

షారుఖ్ నటించిన పఠాన్ చిత్రాన్ని అడుగడుగునా బజరంగ్ దళ్ నేతలు అడ్డుకుంటున్నారు. షారుఖ్ ఖాన్ – దీపికా పదుకొనె జంటగా సిద్దార్థ్ ఆనంద్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ ‘పఠాన్’. ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ ‘బేషరమ్ రంగ్’ సాంగ్ రిలీజ్ అయ్యి..ఎంత వివాదం సృష్టించిందో చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా షారుఖ్ ఖాన్..ను కాల్చేస్తామంటూ రాజకీయ నేతలు హెచ్చరించారు. ముఖ్యంగా ఈ సాంగ్ లో దీపికా అందాల ఆరబోత చేయడం , కాషాయం రంగులో ఉన్న బికినీ ధరించడం పట్ల చాలామంది ఆగ్రహం వ్యక్తం చేసారు. వీటిని సినిమాలో నుండి తొలగించకపోతే అడ్డుకుంటామని హెచ్చరించారు.

ఈ తరుణంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను సైతం బజరంగ్ దళ్ నేతలు అడ్డుకుంటున్నారు. ఈ సినిమా తాలూకా పోస్టర్స్ ను కాల్చేస్తున్నారు. తాజాగా, అహ్మదాబాద్‌లో బజరంగ్ దళ్ కార్యకర్తలు ఓ మాల్‌పై దాడి చేసి ధ్వంసం చేశారు. ‘పఠాన్’ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నగరంలోని అల్ఫావాన్ మాల్‌లోకి ప్రవేశించిన బజరంగ్ దళ్ కార్యకర్తలు విధ్వంసం సృష్టించారు. పఠాన్ సినిమా పోస్టర్లను చింపివేసి కాలితో తొక్కారు. సినిమాను విడుదల చేయొద్దని థియేటర్లను హెచ్చరించారు.

అలాగే సెన్సార్ సైతం చిత్ర మేకర్స్ కు షాక్ ఇవ్వడం జరిగింది. దీపికా బికినీ సహా పాటలో ఆమె అందాల ఆరబోత పై అభ్యంతరం వ్యక్తం చేసింది. పాటలో మార్పులు చేయాలని సెన్సార్ బోర్డ్ మేకర్స్ ను కోరింది. ఖచ్చితంగా సెన్సార్ నిబంధలను పాటించి తీరాలని ఆదేశాలిచ్చింది. దాంతో ఈ పాటలో మార్పులు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక హీరోగా షారుక్ సినిమా చేసి చాలా కాలం అయ్యింది. చివరిగా షారుక్ నటిస్తోన్న సినిమా జీరో. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. ఆ తర్వాత షారుక్ చాలా గ్యాప్ తీసుకున్నారు. మధ్యలో ఒకటి రెండు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించాడు. ఇక వచ్చే ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు షారుక్. వాటిలో పఠాన్ సినిమా ఒకటి . యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది.