ఫొటోస్ తో అభిమానులను సంతృప్తి పరుస్తున్న రాధే శ్యామ్ టీం

ప్రభాస్ అభిమానులకు గత కొంతకాలంగా నిరాశే మిగులుతుంది. బాహుబలి సిరీస్ తో వరల్డ్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకొని , పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్…ఆ మూవీ తర్వాత సాహో తో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అభిమానులను అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత మొదలుపెట్టిన రాధే శ్యామ్ మూవీ ఫై భారీ అంచనాలే పెట్టుకున్నారు. కానీ ఈ మూవీ మాత్రం అభిమానుల ముందుకు రాలేకపోతుంది. కరోనా కారణంగా షూటింగ్ లు పడుతూ..మొదలవుతూ..ఎట్టకేలకు పూర్తి చేసుకొని సంక్రాంతి బరిలో రావాలని ఫిక్స్ అయ్యారు. దానికి తగ్గట్లే అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు కానీ మరోసారి కరోనా కారణంగా విడుదల ఆగిపోయింది. దీంతో అభిమానులు , చిత్ర యూనిట్ మరింత నిరాశ లో పడ్డారు. ఇక అభిమానులను నిరాశ లో నుండి బయటకు తీసేందుకు చిత్ర యూనిట్ వర్కింగ్ స్టిల్స్ రిలీజ్ చేయడం మొదలుపెట్టింది.

డార్లింగ్ ప్రభాస్ తో పూజా కలిసి ఉన్న కొన్ని ఫోటోలను తాజాగా రిలీజ్ చేసారు రాధాకృష్ణ. అంతా సవ్యంగా జరిగి ఉంటే రాధే శ్యామ్ కేవలం నాలుగు రోజుల్లోనే భారీ విడుదలకు సిద్ధమయ్యేది. కానీ అది సాధ్యపడలేదు. అందుకే నిరాశ చెందిన అభిమానుల కోసం ఈ ప్రత్యేక ఫోటోలు అని అర్థమవుతోంది. అభిమానులను ఉత్సాహపరచడానికి తన వంతు ప్రయత్నం చేసారు రాధాకృష్ణ. ప్రస్తుతం ఈ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి. చారల చొక్కాతో ప్రభాస్.. తన చెంతనే ఉండి సీన్ ని వివరిస్తూ రాధాకృష్ణ కుమార్ ఓ ఫోటోలో కనిపించగా.. వేరొక ఫోటోలో పూజాకు కూడా సీన్ ని వివరిస్తూ దర్శకుడు కనిపించాడు. ఇక కరోనా ఉదృతి తగ్గినా తర్వాత సినిమాను రిలీజ్ చేసే క్రమంలో చిత్ర యూనిట్ ఉన్నారు.