నిల‌క‌డ‌గా లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ ఆరోగ్యం ః భార‌తి

lalu-prasad-yadav

న్యూఢిల్లీః దిల్లీ ఎయిమ్స్​ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్​ యాదవ్​ ఆరోగ్యంపై కుమార్తె మీసా భార‌తి అప్డేట్​ వెల్లడించారు. లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉన్న‌ట్లు ఆమె తెలిపారు. ఇత‌రుల స‌హాయంతో ఆయ‌న నిలబ‌డగ‌లుగుతున్నార‌ని తెలిపారు. గ‌తంలో కంటే లాలూ ఆరోగ్యం ప్ర‌స్తుతం బెట‌ర్‌గా ఉంద‌ని భార‌తి పేర్కొన్నారు. ప్ర‌స్తుతం లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.

మరోవైపు ఆయన తనయుడు తేజస్వీ యాదవ్​. లాలూ ఆరోగ్య పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉందని గురువారం రాత్రి తేజస్వీ చెప్పారు. ఇంటెన్సివ్ కేర్​లో వైద్యుల పర్యవేక్షణలో లాలూ ఉన్నారన్న తేజస్వీ.. సోషల్​ మీడియాలో వస్తున్న ఊహాగానాలను నమ్మవద్దని ప్రజలను కోరారు. “నాన్న ఆరోగ్యం క్రమక్రమంగా మెరుగపడుతోంది. గురువారం కిచిడీ తిన్నారు. కుటుంబసభ్యులతో మాట్లాడారు. కేవలం పడుకున్నప్పుడే మాత్రమే ఆక్సిజన్​ సపోర్టు ఇస్తున్నారు డాక్టర్లు. త్వరలోనే ఐసీయూ నుంచి జనరల్​ వార్డుకు తరలించే అవకాశం ఉంది”

కాగా, లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌ను పాట్నా నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్‌కు బుధ‌వారం సాయంత్రం త‌ర‌లించిన సంగ‌తి తెలిసిందే. గ‌త వారం లాలూ త‌న ఇంట్లోనే మెట్లు ఎక్కుతుండ‌గా జారి ప‌డ్డారు. దీంతో ఆయ‌న‌ను హుటాహుటిన చికిత్స నిమిత్తం పాట్నాలోని పారాస్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. లాలూ భుజం, వెన్నెముక‌కు తీవ్ర గాయ‌మైన‌ట్లు డాక్ట‌ర్లు నిర్ధారించారు. మెరుగైన వైద్యం కోసం ఢిల్లీ ఎయిమ్స్‌కు త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/