మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే విన‌య్ లను అభినందించిన మంత్రి కెటిఆర్‌

minister-ktr-complements-to-minister-srinivas-goud-and-mla-vinay-bhasker

హైదరాబాద్ః కాక‌తీయ స‌ప్తాహంను గొప్ప‌గా ప్రారంభించినందుకు రాష్ట్ర ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ప్ర‌భుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్క‌ర్‌పై రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ల మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా అభినందించారు. వారం రోజుల పాటు జ‌రిగే కాక‌తీయ స‌ప్తాహం వేడుక‌లు కాక‌తీయ రాజుల సేవ‌ల‌ను గుర్తు చేస్తున్నాయ‌న్నారు. అదే విధంగా మ‌న సంస్కృతిని, వార‌స‌త్వాన్ని ఈ వేడుక‌లు గుర్తు చేస్తున్నాయ‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

కాగా, వరంగల్‌లో ఏడు రోజుల పాటు ‘కాకతీయ వైభవ సప్తాహం’ వేడుకలు అట్టహాసంగా జరిపేందుకు తెలంగాణ సర్కార్ సిద్దమైన విషయం తెలిసిందే. ఈ నెల 13 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/