తమిళనాడు సిఎంకు మాతృవియోగం

తమిళనాడు సిఎంకు మాతృవియోగం
Tamil Nadu CM Palaniswami’s mother passes away

చెన్నై: తమిళనాడు సిఎం య‌డ‌ప్పాడి ప‌ల‌నీస్వామి మాతృమూర్తి థ‌వాసే అమ్మల్‌ (93) ఈరోజు తెల్లవారుజామున మృతి చెందారు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో గుండెపోటుకు గురైన ఆమెను కుటుంబీకులు సెలంలోని ప్రైవేట్ ఆసుపత్రికి త‌ర‌లించ‌గా చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. తల్లి అంత్యక్రియలు నిర్వహించేందుకు సిఎం పలనీస్వామి ఇప్పటికే సేలంకు చేరుకున్నారు. సేలం జిల్లా సిలువంపాలయంలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రాష్ట్ర మంతులు. ఎమ్మెల్యేలు పలువురు ఏఐఏడీఎంకే ముఖ్యనాయకులు అమ్మల్‌ భౌతికకాయాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. సిఎంను పరామర్శించి అమ్మల్‌ మృతికి సంతాపం తెలిపారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/