జాతిపిత ఉంటే సీఏఏకు వ్యతిరేకంగా నిరాహార దీక్ష

370 రద్దుపై ఢిల్లీ నుంచి జమ్ము-కశ్మీర్‌ వరకు పాదయాత్ర చేసేవారు

Digvijaya Singh
Digvijaya Singh

భోపాల్‌: జాతిపిత మహాత్మగాంధీ బతికి ఉంటే పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో నిరహార దీక్షకు దిగేవారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్  సింగ్‌ అన్నారు. ఒక పుస్తకావిష్కరణ కార్యమ్రంలో పాల్గొనేందుకు ఇక్కడకు వచ్చిన దిగ్విజయ్  మీడియాతో మాట్లాడుతూ కొత్త పౌరసత్వ చట్టం, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా నెలరోజులుగా షహీన్‌ బాగ్‌లో శాంతియుత నిరసనలు కొనసాగుతున్నాయని అన్నారు. గాంధీజీ ఈ రోజు కనుక మనమధ్య ఉండి ఉంటే ఆయన తప్పనిసరిగా షహీన్‌బాగ్‌లో దీక్షకు కూర్చునేవారని, అలాగే 370 అధికరణ రద్దుపై న్యూఢిల్లీలోని లాల్‌ ఖిలా నుంచి జమ్మూకశ్మీర్‌లోని లాల్‌ చౌక్‌ వరకూ పాదయాత్ర చేసేవారని అన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/