ఉద్యోగులకు శుభ ‘వార్త’

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్- అకౌంట్ హోల్డర్లకు చల్లని కబురు

Good News for Employees
Good News for Employees

ముఖ్యాంశాలు

  • 100 లోపు ఉద్యోగులు ఉన్న సంస్థల్లో రూ.15,000 లోపు వేతనం ఉన్నఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్లకు
  • ఎంప్లాయర్ షేర్ 12 శాతం, ఎంప్లాయీ షేర్ 12 శాతం మూడు నెలల పాటు కేంద్ర ప్రభుత్వమే చెల్లింపు
  • మరో మూడు నెలలు పొడిగింపు
  • ఇకపై ఎంప్లాయర్ షేర్ 10 శాతం, ఎంప్లాయీ షేర్ 10 శాతం చెల్లిస్తే చాలు.
  • ఉద్యోగుల వేతనం పెంచేందుకు మరో నిర్ణయం

New Delhi: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్- అకౌంట్ హోల్డర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

కరోనా వైరస్ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రూ.20 లక్షల కోట్లతో ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఆ ప్యాకేజీ లో భాగంగా సంఘటిత రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. 

100 లోపు ఉద్యోగులు ఉన్న సంస్థల్లో రూ.15,000 లోపు వేతనం ఉన్నవారికి ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్లకు ఎంప్లాయర్ షేర్ 12 శాతం, ఎంప్లాయీ షేర్ 12 శాతం మూడు నెలల పాటు కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని గతంలోనే ప్రకటించింది కేంద్రం.

అంటే  మార్చి, ఏప్రిల్, మే నెలలకు మాత్రమే ఇది వర్తిస్తుందని గతంలో చెప్పింది. ఇప్పుడుదానిని  మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్లు నిర్మల ప్రకటించారు.

జూన్, జూలై, ఆగస్ట్ నెలల్లో కూడా ఎంప్లాయర్ షేర్ 12 శాతం, ఎంప్లాయీ షేర్ 12 శాతం కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది.

అలాగే  ఉద్యోగుల వేతనం పెంచేందుకు మరో నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. 12 శాతం చొప్పున ఉన్న ఎంప్లాయర్, ఎంప్లాయీ షేర్‌ను 10 శాతానికి తగ్గిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఇకపై ఎంప్లాయర్  షేర్ 10 శాతం, ఎంప్లాయీ షేర్ 10 శాతం చెల్లిస్తే చాలు.

అంటే ఉద్యోగులకు 4 శాతం వేతనం అదనంగా వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం 12 శాతం చొప్పున ఎంప్లాయర్, ఎంప్లాయీ షేర్‌ చెల్లిస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు.

ఇక ఇప్పటికే ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనలో భాగంగా ఉద్యోగులు తమ పీఎఫ్ బ్యాలెన్స్‌లో 75% లేదా మూడు నెలల వేతనం.

వీటిలో ఏది తక్కువ అయితే అది నాన్ రీఫండబుల్ అడ్వాన్స్‌గా విత్‌డ్రా చేసుకోవచ్చని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/