త్రివిక్రమ్ బర్త్ డే గిఫ్ట్ : భీమ్లా నాయక్ నుండి దుమ్ములేపే సాంగ్ వచ్చింది

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పుట్టిన రోజు ఈరోజు (నవంబర్ 07 ). ఈ సందర్బంగా భీమ్లా నాయక్ నుండి దుమ్ములేపే సాంగ్ వచ్చింది. సాగర్ డైరెక్షన్లో భీమ్లా నాయక్ తెరకెక్కుతుంది. ఈ మూవీ ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఫై నాగ వంశీ నిర్మిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే , మాటలు అందిస్తుండడం విశేషం. ఈ చిత్రంలో పవన్ స‌ర‌స‌న మలయాళ బ్యూటీ నిత్యామీనన్ నటిస్తుండగా.. రానాకు స‌ర‌స‌న సంయుక్త మీన‌న్ నటిస్తుంది.

ఇక ఈ మూవీ ఫై ఎలాంటి అంచనాలు నెలకొని ఉన్నాయో తెలియంది కాదు..ఆ అంచనాలకు తగ్గట్లే సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ చేయబోతున్నారు. ఈరోజు త్రివిక్ర‌మ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా భీమ్లా నాయక్ ఫుల్ సాంగ్ విడుద‌ల చేశారు. ఈ సాంగ్‌లో థ‌మ‌న్ డ్ర‌మ్స్ వాయిస్తుంటే డ్యాన్స‌ర్స్ పూన‌కం వ‌చ్చిన‌ట్టు ఊగిపోతున్నారు. ఈ పాట ఫ్యాన్స్‌కి కూడా పూనకాలు తెప్పిస్తుంది.

YouTube video