ప్రాణాలు తీస్తున్న ‘స్కల్ బ్రేకర్ ఛాలెంజ్’
ఇటీవల కాలంలో టిక్‌టాక్ వచ్చినప్పటి నుంచి ‘ఛాలెంజ్‌లు ఎక్కువైపోతున్నాయి. అందులో కొన్ని మంచివి ఉంటున్నా కొన్ని మాత్రం చెడు చేసే చాలెంజ్‌లు వస్తున్నాయి.

రన్నింగ్కార్ నుంచి దిగి నెమ్మదిగా కదులుతున్న ఆ కార్ పక్కన డాన్స్ చేసి మళ్లీ కారెక్కే ‘రన్నింగ్ మ్యాన్ ఛాలెంజ్ చాలా రోజుల క్రితం వచ్చింది. దానివల్ల చాలా మంది యాక్సి డెంట్ల బారినపడ్డారు. ఇప్పుడు తాజాగా మన శరీరంలోని ఎము కలను విరగగొట్టుకునే మరొక చెత్త ఛాలెంజ్ ఇటీవలి కాలంలో టిక్‌టాక్‌లో వైరల్ అవ్ఞతోంది.
ప్రస్తుతం ఇప్పటికి మనదేశంలో లేకపోయినా వేరే దేశాల్లో చేస్తున్న ఆ ఛాలెంజ్ వీడియోలు మాత్రం ఇక్కడ వైరల్ అవ్ఞతున్నాయి. సోషల్ మీడియాలో ఛాలెంజ్‌లు ఈ మధ్య వైరల్‌గా మారుతున్నాయి. కొత్త కొత్త వీడియో గేమ్‌లే కాకుండా, టిక్‌టాక్ లాంటి వాటిల్లో వెల్లువెత్తున్న ఛాలెంజ్‌లు ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. ముఖ్యంగా యువత వీటికి ఇట్టే ఆకర్షితులైపోతున్నారు. ఫలితంగా తెలిసీ తెలియని వయసులో ఛాలెంజ్‌ల పేరుతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటు న్నారు. ఇంతకీ ఆ ఛాలెంజ్ ఏమిటి? డాక్టర్లు దీని గురించి చేస్తున్న హెచ్చరిక ఏమిటో నేడు సోషల్ మీడియాతో నిత్యం గడుపుతున్న యువతతోపాటు అందరూ తెలుసుకోవాలి.
ఈ ఛాలెంజ్ పేరు ‘స్కల్‌బ్రేకర్ ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ పేరులోనే తెలుస్తున్నది. ఇది ప్రాణాల మీదకు తెచ్చే ఆట అని. ఇప్పుడు ఆ ఆట ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారింది. స్కూళ్లు, కాలేజీల్లో చదువ్ఞకునే పిల్లలు, యువకులు ఈ ఆటకు ఆకర్షితులై సరదాగా మొదలుపెడతున్నారు. కానీ ఇది ప్రాణాల మీదకు తెస్తోంది. ఈ ప్రమాదకర ఛాలెంజ్ వీడియోలు సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్‌ల్లో బాగా వైరల్ అవ్ఞతోంది. స్కల్ బ్రేకర్ ఛాలెంజ్ అంటే ముగ్గురు వ్యక్తులు నిల్చుంటారు. అందులో ఇద్దరు వ్యక్తులు గాలిలో ఎరుగుతుండగా, మూడో వ్యక్తి వారి మధ్య నిల్చుని అలాగే చూస్తుంటాడు. మధ్యలో వ్యక్తి పైకి ఎరిగినప్పుడు అతడి కాళ్లపై మిగిలిన ఇద్దరూ తన్నడం.
ఈ గేమ్ ప్రత్యేకత. మధ్యలో వ్యక్తి పైకి ఎగిరినప్పుడు కిందపడేలా తన్నడం చేయాలి. అంటే మధ్యలో నిలబడి ఉన్న వ్యక్తి ఎగిరిన సమయంలో వాళ్లు ఎగరకుండా చెరో కాలితో మధ్యలో ఉన్న వ్యక్తి కాళ్లను ముందుకు తన్నడంతో అతడు వెల్లకిలాపడిపోతాడు. ఫలితంగా భారం అంతా నడుం, వెన్నుపూస, తలపై పడుతుంది. ఈ ఆట ప్రాణాంతకం. వెన్నెముక దెబ్బతిన్నా, తలకు గట్టిగా దెబ్బతగిలినా మనిషి లేవలేడని వైద్యులు చెబుతున్నారు. ఈ కిల్లింగ్ గేమ్ వైరల్‌గా మారుతున్నది. యువత ఈ ఛాలెంజ్ మత్తులో కూరుకుపోతున్నారు. గతంలో కూడా సిన్నామన్ ఛాలెంజ్, కైలీ జెన్నర్ లిప్ ఛాలెంజ్ వంటి హానికరమైన ఛాలెంజ్‌లలో కూడా యువకులు పాల్గొన్నారు.
తాజాగా వెనిజులా దేశంలోని స్కూల్ విద్యార్థులు స్కల్‌బ్రేకర్ ఛాలెంజ్‌లో పాల్గొనడం వల్ల ఒక బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఛాలెంజ్ వీడియో చేయడం వల్ల తలకు గాయాలు అయి బాలుడిని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేర్పించినట్లు ఒక పత్రిక కథనంలో తెలిపింది. ఆ ఛాలెంజ్ వీడియో వైరల్ అయింది. ఛాలెంజ్‌లో పాల్గొన్న ముగ్గురు స్కూల్ విద్యార్థులపై కూడా యాజమాన్యం చర్యలు తీసుకున్నట్లు చెప్పా రు. ఇలాంటి ఛాలెంజ్‌లో పాల్గొనేవారికి తీవ్రమైన గాయాలు, ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరి స్తున్నారు.
సోషల్ మీడియాలో చాలా మంది ఈ ప్రమాదకరమైన వీడియోలను షేర్ చేస్తున్నారు. ప్రజలను ముఖ్యంగా యువకులను ఇందులో పాల్గొనకుండా ఉండాలని నిపుణులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంతకుముందు బ్లూవేల్, మోమో ఛాలెంజ్‌లని యువత ఈ స్టంట్లు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.
టిక్‌టాక్‌లో స్కల్‌బ్రేకర్ వీడియోలు చూసి తమ పిల్లల పట్ల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి స్టంట్లు చేయడం వల్ల తల, చేతి ఎముకలు విరిగే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నేడు హింసాపూరితమయిన వీడియో గేమ్‌లు, ఛాలెంజ్‌ల బారినపడకుండా నేటి యువత స్వీయ నియంత్రణ అలవర్చుకోవాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యాసంస్థల యాజమాన్యాలు తమ పరిధిలో విద్యార్థులను గమనిస్తూ వీటిబారిన పడకుండా మార్గనిర్దేశనం చేయాలి.
- ఆత్మకూరు భారతి
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/