చిరంజీవి మూవీ లో పవన్..?

మెగాస్టార్ చిరంజీవి మూవీ లో పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నాడా..? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం 154 వ చిత్రాన్ని ప్రారంభించారు. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న ఈ చిత్రం డిసెంబ‌ర్‌లో సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. వైజాగ్ పోర్ట్ నేపథ్యంలో సాగే ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది అని లీకులందుతున్నాయి. ముఠామేస్త్రిలో చిరంజీవి పాత్రని మించి మాసిజం కనిపిస్తుందని జోరుగా ప్రచారం సాగుతోంది.

ఈ చిత్రానికి సంబంధించి వార్త హ‌ల్ చ‌ల్ చేస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని చిరంజీవి బ్రదర్ పాత్ర కోసం చూపించేందుకు బాబి ఆస‌క్తిగా ఉన్నాడ‌ట‌. ఇందుకోసం ప‌వ‌న్‌ని సంప్ర‌దించిన‌ట్టు కూడా టాక్ న‌డుస్తుంది. ఆ పాత్ర చాలా బలంగా ఉంటుందని.. నేరుగా సొంత తమ్ముడు పవన్ కళ్యాణ్ నే రంగంలోకి దించితే ఆ పాత్ర ఇంకా బాగా పండుతుందని..దాంతో పాటు సినిమా మైలేజ్ వస్తుందని బాబి ప్లాన్ చేస్తున్నార‌ట‌. మరి ఈ వార్త లో ఎలాంటి నిజం ఉందొ లేదో తెలియాల్సి ఉంది.