ప్రపంచవ్యాప్తంగా 24 గంటల్లో లక్ష కేసులు

అమెరికా, యూకే, బ్రెజిల్‌లో కరోనా కేసులు  అధికం

COVID-19

అమెరికా: కరోనా మహమ్మారి కేసులు ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. గత 24 గంటలో ప్రపంచవ్యాప్తంగా లక్ష కేసులు నమోదయ్యాయి. కాగా ఒక్క అమెరికాలోనే 26,398 కేసులు నమోదయ్యాయి. జిల్‌లో 13,761, రష్యాలో 9,974 కేసులు నమోదయ్యాయి. ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్‌లలో వందల సంఖ్యలోనే కేసులు నమోదయ్యాయి. మరోవైపు భారత్‌లో నిన్న ఒక్క రోజే 3,942 మంది కరోనా బారినపడ్డారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 45 లక్షల మార్క్ దాటిపోయింది. ఇక మరణాలు చూస్తే అమెరికాలో నిన్న 1,703 మంది మరణించారు. స్పెయిన్‌లో 217 మంది, బ్రిటన్‌లో 428 మంది, ఇటలీలో 262 మంది, బ్రెజిల్‌లో 835 మంది, ఫ్రాన్స్‌లో 351 మంది మెక్సికోలో 294 మంది, కెనడాలో 170 మంది కరోనా కాటుకు బలయ్యారు. అమెరికాలో మొత్తంగా 86,900 మంది కరోనా వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. మరణాల్లోనూ, కేసుల్లోనూ అమెరికా ప్రపంచంలోనే ముందుండడం గమనార్హం.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/