అన్ని జిల్లాలకు ఒకే విధంగా కర్ఫ్యూ నిబంధనలు
రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ
curfew-relaxations-in-ap
అమరావతి : సీఎం జగన్ కరోనాపై మంత్రులు ఆళ్లనాని, బొత్స సత్యనారాయణతో పాటు పలువురు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కట్టడికి తీసుకుంటోన్న చర్యలపై ఆయన చర్చిస్తున్నారు. రాష్ట్రంలో కొనసాగుతోన్న వ్యాక్సినేషన్ కార్యక్రమంపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏపీలో కర్ఫ్యూ నిబంధనలను మరింత సడలించే అంశంపై నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రంలో అన్ని జిల్లాలకు ఒకే విధంగా కర్ఫ్యూ నిబంధనల అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు కొనసాగించాలని నిర్ణయించారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కర్ఫ్యూ ఉండబోదు. రాత్రి 9 గంటలకు అన్ని దుకాణాలు మూసి వేయాల్సి ఉంటుంది. దుకాణాల్లో సిబ్బందితో పాటు కొనుగోలుదారులు మాస్కులు ధరించడం తప్పనిసరి చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే దుకాణాలకు భారీ జరిమానా విధించనున్నారు. ప్రజలు మాస్కులు ధరించకపోతే రూ.100 జరిమానా నిబంధనను కచ్చితంగా అమలు చేయనున్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/