టీడీపీకి భారీ షాక్…టీఆర్ఎస్‌లోకి ఎల్.రమణ?

హైదరాబాద్: తెలంగాణలో టీడీపీకి మరో భారీ షాక్ తగలనుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ కండువా మార్చుకోనున్నారా? గులాబీ గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారా? అంటే అవుననే సమాధానమొస్తోంది. రమణకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి పార్టీలోకి చేర్చుకునేందుకు గులాబీ బాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ మేరకు ఎల్.రమణతో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. ఈ వారంలోనే ఎల్‌.రమణ టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశాలు కనబడుతున్నాయి.

గతేడాది తెలంగాణ తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. టీటీడీపీ అధ్యక్షుడుగా ఉన్న ఎల్‌.రమణ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న పా​ర్టీ నేతలు గత సెప్టెంబర్‌లో తిరుగుబాటుకు దిగారు. తెలంగాణ పార్టీ నాయకత్వ మార్పు కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. గత ఏడేళ్లుగా ఒకే వ్యక్తి అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారని, రాష్ట్రంలో పార్టీ ఉనికి ఆందోళనలో పడిందని, ఇప్పటికైనా అధ్యక్షుడిని మార్చాలంటూ వారు డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలోనే టీడీపీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రమణ సన్నద్ధమైనట్లు తెలుస్తోంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/