ఏంట్రా..బాబు పవన్ క్రేజ్..? 20 ఏళ్ల సినిమాకు కూడా ఈ రేంజ్ లో కల్లెక్షన్లా..?

పవన్ కళ్యాణ్ రేంజ్ ఏంటో మరోసారి ఖుషి మూవీ తో రుజువైంది. సినిమా ఎలా ఉన్న సరే..అది ఇప్పటిదా..20 ఏళ్ల క్రితందా మాకు అనవసరం..మా దేవుడ్ని ఆలా చూడడమే మాకు కావాలి..ఇది పవన్ అభిమానులు చెపుతున్న మాట. ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతుంది. అగ్ర హీరోల తాలూకా సూపర్ హిట్ చిత్రాలను మళ్లీ రీ రిలీజ్ చేస్తున్నారు అలరిస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ 2001 లో నటించిన ఖుషి మూవీ న్యూ ఇయర్ సందర్బంగా డిసెంబర్ 31 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్ర రీ రిలీజ్ సందర్బంగా అభిమానులు థియేటర్స్ వద్ద సంబరాలు జరిపారు.

ఓ కొత్త సినిమా రిలీజ్ అయితే ఎలా ఉంటుందో అంతకు మించి అనేలా పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి , భారీ కట్ ఔట్స్ ఏర్పాటు చేసి పాలాభిషేకాలు వంటివి చేయి తమ అభిమానాన్ని చాటుకున్నారు. డిసెంబర్ 31 నుండి జనవరి 06 వరకు ఈ సినిమా ప్రదర్శన కొనసాగనుంది. ఇక ఫస్ట్ రోజు వరల్డ్ వైడ్ 3 కోట్ల 50 లక్షలకు పైగా గ్రాస్ వచ్చిందట. ఈ గ్రాస్ మామూలుది కాదు.. ఈ రోజుల్లో మీడియం రేంజ్ హీరోకు వచ్చే ఓపెనింగ్ ఇది. ఈ రేంజ్ లో వసూళ్లు రాబట్టడం చూసి అంత షాక్ అవుతున్నారు. ఇక నిన్న కూడా భారీగా వసూళ్లు అయ్యాయని అంటున్నారు. ఏది ఏమైనప్పటికి పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో మరోసారి రుజువైంది.