డొంక కదులుతోంది ..

సినీపరిశ్రమలో డ్రగ్స్‌ కేసు కలకలం

riya chakravarthi-Rakul-Sara Ali Khan
riya chakravarthi-Rakul-Sara Ali Khan

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతిపై విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఈ కేసులో ఆరోపణలు ప్రధానంగా ఎదుర్కొంటున్న సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి వాట్సాప్ చాటింగ్ ద్వారా డ్రగ్స్ వ్యవహారం బయటపడటంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు.

అయితే ఎన్సీబీ ఉన్నతాధికారుల విచారణలో రియా చక్రవర్తి పలు సంచలన విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది.

సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ తీసుకునే అలవాటున్న మరికొంతమంది హీరో హీరోయిన్ల పేర్లు రియా బయటపెట్టినట్లు సమాచారం.

రియా వెల్లడించిన 25 మంది పేర్లతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఇప్పటికే ఓ లిస్టు తయారు చేసినట్లు.. డ్రగ్స్ వాడకంతో సంబంధం ఉన్న సినీ ప్రముఖులందరిపై నిఘా పెట్టినట్లు తెలిసింది

సినీ ఇండస్ట్రీని కుదిపేస్తున్న డ్రగ్స్ వ్యవహారంలో ప్రముఖ హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్ – సారా అలీఖాన్ మరియు డిజైనర్ సిమోన్ ఖంబట్ట పేర్లు కూడా ఉన్నాయని మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది.

ఎన్సీబీ ఉన్నతాధికారుల విచారణలో రియా.. వీరి పేర్లు వెల్లడించినట్లుగా నేషనల్ మీడియా చెప్తోంది. మరి నిజానిజాలు బయటకు రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.

రియా చక్రవర్తి – రకుల్ ప్రీత్ సింగ్ కలిసి ఉన్న ఫొటోలో నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

ఇదిలా ఉండగా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన రియా మరియు ఆమె సోదరుడు షోవిక్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. 

తాజా ఆధ్యాత్మికం వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/devotional/