ఖుషి నుండి రొమాంటిక్ మెలొడీ సాంగ్ వచ్చేసింది

విజయ్ దేవరకొండ – సమంత జంటగా మజిలీ ఫేమ్ శివ నిర్వాణ డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ ఖుషి. గతేడాది లైగర్‌ మూవీతో భారీ ప్లాప్ అందుకున్న విజయ్. సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం ఈ ఏడాది నిరాశపరిచింది. ఇప్పుడు వీరిద్దరు కలిసి ఖుషి సినిమాలో నటిస్తున్నారు. కాగా, ఖుషి సినిమా నుంచి రెండో పాట ఆరాధ్య ను విడుదల చేసారు. ఈ పాటను సిద్ శ్రీరామ్, చిన్మయి శ్రీపాద పాడారు. శివ నిర్వాణ రచించారు. హిషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించారు. ఈ పాటలో విజయ్ – సమంత ల మధ్య కెమిస్ట్రీ బాగా ఆకట్టుకుంటుంది. ఇద్దరి పెళ్లి, వ్యక్తిగత జీవితాలు, మళ్లీ ఇంటికొచ్చాక వారి మధ్య ఉండే ప్రేమను అక్కడక్కడా చూపించారు.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సాంగ్ ‘నా రోజా నువ్వే’ చాలా పాపులర్ అయింది. మంచి స్పందనను దక్కించుకుంటోంది. ఖుషి సినిమాలో జయరామ్, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేనీ, యలమంచిలి రవిశంకర్ ఈ చిత్రాన్ని హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో పాన్ ఇండియాగా రిలీజ్ చేయబోతుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ దివ్యాంశ కౌషిక్ కూడా ఓ పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. దివ్యాంశ కౌశిక్ సమంతకి చెల్లి పాత్రలో నటిస్తున్నారని టాక్.. సమంత, దివ్యాంశ గతంలో నాగ చైతన్య హీరోయిన్‌గా వచ్చిన మజిలీలో కలిసి నటించారు.

YouTube video